మధ్యప్రదేశ్‌‌లోని కునో పార్క్‌‌లో.. 3 కూనలకు జన్మనిచ్చిన గామిని

మధ్యప్రదేశ్‌‌లోని కునో పార్క్‌‌లో.. 3 కూనలకు జన్మనిచ్చిన గామిని
  • దేశంలో 38కి పెరిగిన చిరుతల సంఖ్య

భోపాల్‌‌: మధ్యప్రదేశ్‌‌లోని కునో నేషనల్‌‌ పార్క్‌‌లో గామిని అనే చిరుత బుధవారం 3 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్‌‌‌‌ యాదవ్‌‌ ఎక్స్‌‌లో షేర్‌‌‌‌ చేశారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఆడ చిరుత గామిని.. 3 కూనలను కనడంతో దేశంలో చిరుతల సంఖ్య 38కి చేరుకుందని పేర్కొన్నారు.

వీటి జననం ప్రాజెక్ట్‌‌ చీతా ఉద్దేశానికి బలం చేకూరుస్తుందని, మన దేశానికి గర్వకారణమని అన్నారు. పులులకు అనుకూల వాతావరణం కల్పించిన అటవీశాఖ సిబ్బంది, డాక్టర్లను ఆయన అభినందించారు. మూడు చీతాల జననంపై మధ్యప్రదేశ్‌‌ సీఎం మోహన్‌‌ యాదవ్‌‌ సంతోషం వ్యక్తం చేశారు. మన దేశంలో చీతాల సంతతిని పెంచేందుకు 2022లో ప్రాజెక్ట్‌‌ చీతాను ప్రారంభించారు.